Pakistani Players: డబ్ల్యూసీఎల్‌పై పీసీబీ నిషేధం
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:30 AM
వరల్డ్ చాంపియన్‌షి్‌ప ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో పాక్ ఆటగాళ్లు పాల్గొనకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిషేధం విధించింది. అంతేకాకుండా డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు...
లాహోర్: వరల్డ్ చాంపియన్‌షి్‌ప ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో పాక్ ఆటగాళ్లు పాల్గొనకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిషేధం విధించింది. అంతేకాకుండా డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని పీసీబీ ఆరోపించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత వెటరన్ జట్టు.. లీగ్ దశలో, సెమీ్‌సలో పాక్‌తో మ్యాచ్‌లను బహిష్కరించింది. అయితే, ఆడేందుకు నిరాకరించినా భారత్‌కు నిర్వాహకులు పాయింట్లు కేటాయించడాన్ని పీసీబీ తప్పుబట్టింది. భవిష్యత్‌లో ఈ టోర్నీలో పాక్ ప్లేయర్లు ఆడకుండా మొత్తంగా నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..