Share News

Paul Collingwood: కాలింగ్‌వుడ్‌ కనిపించుటలేదు

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:00 AM

అవును..ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఆ దేశ జట్టు సహాయ కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ కనిపించడంలేదు. గత మే నుంచి అతడు మిస్సవడం ఇంగ్లండ్‌...

Paul Collingwood: కాలింగ్‌వుడ్‌ కనిపించుటలేదు

లండన్‌: అవును..ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఆ దేశ జట్టు సహాయ కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ కనిపించడంలేదు. గత మే నుంచి అతడు మిస్సవడం ఇంగ్లండ్‌ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2005 యాషెస్‌ సిరీస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టు సభ్యులు ఇటీవల ఇక్కడ సమావేశమయ్యారు. ముఖ్యమైన ఈ భేటీకి కూడా కాలింగ్‌వుడ్‌ హాజరు కాలేదు. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ సందర్భంగా చివరిసారి కాలింగ్‌వుడ్‌ కనిపించాడు. వ్యక్తిగత కారణమని చెప్పి ఆ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా జట్టును వీడిన పాల్‌ జాడ అప్పటినుంచి కానరాలేదు. భారత్‌తో ఇటీవల జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీ్‌సకూ అతడు హాజరు కాలేదు. అయితే కాలింగ్‌వుడ్‌ గతంలో పలు సెక్స్‌ కుంభ కోణాలు, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు ఓ సంస్థలో పెట్టుబడిపెట్టి భారీగా నష్టపోయాడట. వీటన్నింటికీ, పాల్‌ కనిపించకపోవడానికి లింకు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 18 , 2025 | 04:00 AM