Share News

వేదికపై మాకేదీ ఆహ్వానం ?

ABN , Publish Date - Mar 11 , 2025 | 02:47 AM

చాంపియన్స్‌ ట్రోఫీ ప్రదానోత్సవంలో తమ ప్రతినిధిని వేదికపైకి ఆహ్వానించకపోవడంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆగ్రహం వ్యక్తంజేసింది...

వేదికపై మాకేదీ ఆహ్వానం ?

ఐసీసీపై పీసీబీ గరం గరం

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ ప్రదానోత్సవంలో తమ ప్రతినిధిని వేదికపైకి ఆహ్వానించకపోవడంపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆగ్రహం వ్యక్తంజేసింది. దీనిపై ఐసీసీకి తన నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. చాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య దేశం పాకిస్థాన్‌ కావడంతో..ముగింపు కార్యక్రమానికి టోర్నీ డైరెక్టర్‌, పీసీబీ సీఈవో సుమైర్‌ అహ్మద్‌ను ఆహ్వానిస్తారని భావించింది. వాస్తవానికి పీసీబీ చైర్మన్‌ మొహ్‌సిన్‌ నక్వీని ట్రోఫీ ప్రదానోత్సవ సభా వేదికపైకి ఆహ్వానించాలని ఐసీసీ భావించింది. కానీ ముందస్తు కార్యక్రమాల రీత్యా ఆయన ఫైనల్‌కు హాజరు కాలేదు. ఈనేపథ్యంలో ఫైనల్‌ ప్రదానోత్సవ వేడుక ప్రణాళికలో మార్పు చేసినట్టు పీసీబీకి ఐసీసీ వివరించింది. కానీ ఐసీసీ వివరణను పాకిస్థాన్‌ తిరస్కరించింది. తమ సీఈవో సుమైర్‌ ఫైనల్‌కు హాజరయ్యారని, ప్రొటోకాల్‌ రీత్యా పీసీబీ చీఫ్‌కు బదులు ఆయనను వేదికపైకి ఆహ్వానించాలన్న విషయాన్ని గుర్తు చేసింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 11 , 2025 | 02:48 AM