Share News

Hockey India Clarifies: పాక్‌ ఆటగాళ్లతో మేం కరచాలనం చేస్తాం

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:02 AM

భవిష్యత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా పాకిస్థాన్‌ ఆటగాళ్లతో మన జట్టు కరచాలనం చేయకుండా నిరోధించలేమని హాకీ...

Hockey India Clarifies: పాక్‌ ఆటగాళ్లతో మేం కరచాలనం చేస్తాం

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ల సందర్భంగా పాకిస్థాన్‌ ఆటగాళ్లతో మన జట్టు కరచాలనం చేయకుండా నిరోధించలేమని హాకీ ఇండియా (హెచ్‌ఐ) స్పష్టంజేసింది. వారితో కరచాలనం చేయవద్దంటూ తమకు ఎవరి నుంచీ ఆదేశాలు లేవని తేల్చింది. ఇటీవల మలేసియాలో జరిగిన సుల్తాన్‌ జొహార్‌ కప్‌ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ హాకీ జట్టుతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయడంపై వివాదం ఏర్పడిన విషయం విదితమే. భారత పురుషులు, మహిళల జట్లు పాకిస్థాన్‌ క్రికెటర్లకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వని నేపథ్యంలో..హాకీ జట్టు అందుకు విరుద్ధంగా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘మేం క్రికెట్‌ నియంత్రణలో లేము. క్రికెటర్లు ఎలా ప్రవర్తిస్తారన్నది వారి ఇష్టం. ఒలింపిక్‌ చార్టర్‌ను, అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిబంధనలను మేం పాటిస్తాం’ అని హెచ్‌ఐ కార్యదర్శి భోలానాథ్‌ సింగ్‌ స్పష్టంజేశారు.

Updated Date - Nov 06 , 2025 | 05:02 AM