Share News

SRH Player Retention: సన్‌రైజర్స్‌ను వీడే ప్రసక్తి లేదు

ABN , Publish Date - Jul 28 , 2025 | 02:21 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టుతో ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ది విడదీయరాని బంధం. 2024 ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫైనల్‌కు చేరడంలో నితీశ్‌ది కీలక పాత్ర. ఆ సీజన్‌ 13 మ్యాచ్‌ల్లో దాదాపు...

SRH Player Retention: సన్‌రైజర్స్‌ను వీడే ప్రసక్తి లేదు

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టుతో ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ది విడదీయరాని బంధం. 2024 ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫైనల్‌కు చేరడంలో నితీశ్‌ది కీలక పాత్ర. ఆ సీజన్‌ 13 మ్యాచ్‌ల్లో దాదాపు 143 స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్‌ సెంచరీలు సహా నితీశ్‌ 303 పరుగులు కొల్లగొట్టాడు. అలాగే బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక..సీన్‌ కట్‌ చేస్తే..ఎ్‌సఆర్‌హెచ్‌ను నితీశ్‌ వీడనున్నాడని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2026 సీజన్‌కు ముందు అతడు కొత్త జట్టుతో చేరనున్నాడని పేర్కొన్నాయి. ఎట్టకేలకు ఈ వార్తలపై నితీశ్‌ పెదవి విప్పాడు. ‘నేను సన్‌రైజర్స్‌ను వీడనున్నాననే వార్తలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఎస్‌ఆర్‌హెచ్‌తో నా బంధం నమ్మకం, గౌరవంతో కూడినది. అందువల్ల నేను ఎప్పుడూ ఆ జట్టుతోనే కొనసాగుతా’ అని ఎక్స్‌లో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 02:21 AM