Share News

టాప్స్‌ లో నిత్య

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:51 AM

ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో రజతం నెగ్గిన మహిళల 4గీ 100 మీ. రిలే జట్టును టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియమ్‌ స్కీమ్స్‌ (టాప్స్‌)లో చేర్చారు....

టాప్స్‌ లో నిత్య

న్యూఢిల్లీ: ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో రజతం నెగ్గిన మహిళల 4గీ 100 మీ. రిలే జట్టును టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియమ్‌ స్కీమ్స్‌ (టాప్స్‌)లో చేర్చారు. అభినయ, స్నేహ, స్రబానీ నందతో కూడిన ఈ జట్టులో తెలుగు రన్నర్‌ నిత్య గంధే కూడా ఉండడం విశేషం. ఈ జట్టును టాప్స్‌ ‘డెవల్‌పమెంట్‌ గ్రూప్‌’లో చేర్చారు. ఈగ్రూపులో ఉన్న అథ్లెట్లకు నెలకు రూ. 25 వేలు అలవెన్సుగా అందజేస్తారు. ఇక.. టాప్స్‌ ‘కోర్‌ గ్రూప్‌’లో ఉన్న తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖ, పర్నీత్‌ కౌర్‌, ప్రియాన్షు తమకు అవసరమైన పరికరాల కొనుగోలుకు రూ. 11.90 లక్షలు మంజూరు చేశారు.

ఇవీ చదవండి:

సారీ చెప్పి ఫోర్ కొట్టాడు

కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్

దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 04:51 AM