Share News

Women Boxer: హాట్‌ ఫేవరెట్‌..నిఖత్‌

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:28 AM

జాతీయ ఎలీట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌కు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం ముస్తాబైంది.

Women Boxer: హాట్‌ ఫేవరెట్‌..నిఖత్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఎలీట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌కు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం ముస్తాబైంది. శనివారం మొదలవనున్న ఈ పోటీల్లో రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఈసారి కొత్త వెయిట్‌ విభాగంలో బరిలోకి దిగుతోంది. నిఖత్‌ 48-51 కిలోల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాశీ శర్మతో తన తొలి బౌట్‌లో తలపడనుంది. తొలిరోజు మొత్తం 21 బౌట్లు జరగనున్నాయి. నిఖత్‌తో పాటు తెలంగాణ నుంచి 60-65 కిలోల కేటగిరీలో యషి శర్మ, 65-70 కిలోల విభాగంలో పూజ, 75-80 కిలోల కేటగిరీలో కీర్తి పోటీపడుతున్నారు.

Updated Date - Jun 28 , 2025 | 04:29 AM