నిఖత్ శుభారంభం
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:27 AM
జాతీయ మహిళల ఎలీట్ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. శనివారం హైదరాబాద్‌లోని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ మహిళల ఎలీట్ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీల్లో 48-51 కిలోల విభాగంలో నిఖత్ 4-1తో రాశీ శర్మ (ఉత్తరప్రదేశ్)పై గెలిచింది. 60-65 కిలోల విభాగంలో మరో తెలంగాణ బాక్సర్ యషి శర్మ 5-0తో నిషా (తమిళనాడు)పై గెలిచింది. మిగతా తెలంగాణ బాక్సర్లలో 65-70 కిలోల విభాగంలో పూజ, 75-80 కిలోల కేటగిరీలో కీర్తి ఓటమి పాలయ్యారు.
ఇవీ చదవండి:
డేంజరస్ సెలబ్రేషన్.. పంత్ పరిస్థితేంటి..
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి