Share News

Boxing Tournament: పసిడికి పంచ్‌ దూరంలో..

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:13 AM

జాతీయ ఎలీట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బోర్గోహైన్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇక్కడి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీఫైనల్లో నిఖత్‌ 5-0తో లక్ష్యను...

 Boxing Tournament: పసిడికి పంచ్‌ దూరంలో..

  • ఫైనల్స్‌కు నిఖత్‌, లవ్లీనా, నిహారిక, యషిలకు నిరాశ

హైదరాబాద్‌: జాతీయ ఎలీట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బోర్గోహైన్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇక్కడి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సోమవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీఫైనల్లో నిఖత్‌ 5-0తో లక్ష్యను చిత్తుచేసి జ్యోతితో తుదిపోరుకు సిద్ధమైంది. 75 కిలోల కేటగిరి సెమీస్‌లో స్నేహను ఓడించిన లవ్లీనా.. ఫైనల్లో లషు యాదవ్‌తో తలపడనుంది. తెలంగాణకు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు యషి శర్మ (65 కి), నిహారిక గోనెళ్ల (60 కి) సెమీఫైనల్స్‌లో ఓటమి పాలయ్యారు. నిహారికపై ప్రాచి, యషి శర్మపై శశి గెలుపొంది ఫైనల్స్‌కు చేరారు.

Updated Date - Jul 01 , 2025 | 03:17 AM