ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ పూరన్
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:19 AM
అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) జట్టు ఎంఐ న్యూయార్క్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు...
న్యూయార్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు ప్రకటించిన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) జట్టు ఎంఐ న్యూయార్క్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 29 ఏళ్ల పూరన్ మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే. ‘బౌలర్ల గుండెల్లో గుబులు రేపే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సారథ్యంలో ఎంఐ న్యూయార్క్ మరింత ఎత్తుకు ఎదుగుతుందని భావిస్తున్నాం’ అని ఆ ఫ్రాంచైజీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెరికాలో 2023లో ప్రారంభమైన టీ20 టోర్నీ ఎంఎల్‌సీ తొలి సీజన్‌లో ఎంఐ న్యూయార్క్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి చెందినదే ఈ న్యూయార్క్ ఎంఐ.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి