Share News

పూరన్‌ అనూహ్య రిటైర్మెంట్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:20 AM

వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు...

పూరన్‌ అనూహ్య రిటైర్మెంట్‌

విండీస్‌ స్టార్‌ సంచలన నిర్ణయం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. టీ20ల్లో పూరన్‌ అత్యంత దూకుడుగా ఆడే బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2016లో అరంగేట్రం చేయగా, విండీస్‌ తరఫున ఎక్కువ పరుగులు (106 టీ20ల్లో 2,275) సాధించిన రికార్డు నెలకొల్పాడు. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువ సిక్సర్లు (170) బాదిన ఘనత కూడా అతడిదే. అలాగే ఇటీవలి ఐపీఎల్‌లోనూ లఖ్‌నవూ తరఫున 500+ రన్స్‌ సాధించడమే కాకుండా 40 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు. అయితే అతడి విజ్ఞప్తి మేరకు తాజా ఇంగ్లండ్‌, ఐర్లండ్‌లతో సిరీ్‌సలకు విశ్రాంతినిచ్చారు. ఇంతలోనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ వీడ్కోలు ప్రకటించాడు. ‘చాలా ఆలోచించాకే క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా’ అని పూరన్‌ తెలిపాడు. 2022లో విండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పూరన్‌ బాధ్యతలు తీసుకున్నా.. అదే ఏడాది టీ20 మెగా టోర్నీ తొలి రౌండ్‌లోనే జట్టు నిష్క్రమించడంతో రాజీనామా చేశాడు. విండీస్‌ తరఫున టెస్టులు ఆడలేకపోయిన పూరన్‌ 61 వన్డేల్లో 1,983 పరుగులు చేశాడు.

ఇవీ చదవండి:

రింకూతో భువీ డ్యాన్స్

అమ్మకానికి ఆర్సీబీ?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 01:20 AM