Tri Series Final: కివీస్‌దే ముక్కోణం
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:42 AM
టీ20 ముక్కోణపు సిరీస్ టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకొంది. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగులు అవసరమవగా.. దూకుడుమీదున్న బ్రెవిస్...
హరారే: టీ20 ముక్కోణపు సిరీస్ టైటిల్‌ను న్యూజిలాండ్ సొంతం చేసుకొంది. చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగులు అవసరమవగా.. దూకుడుమీదున్న బ్రెవిస్ (31)ను అవుట్ చేసిన హెన్రీ (2/19) మూడు పరుగుల తేడాతో కివీస్‌ను గెలిపించాడు. ఫైనల్లో తొలుత కివీస్ 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది. రచిన్ (47), కాన్వే (47), సీఫెర్ట్ (30) రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 177/6 స్కోరుకే పరిమిత మైంది. ఓపెనర్లు ప్రిటోరియస్ (51), హెండ్రిక్స్ (37) తొలి వికెట్‌కు 92 పరుగుల ధనాధన్ భాగస్వామ్యంతో గెలుపునకు బాటలు వేశారు. డెత్ ఓవర్లలో బ్రెవిస్ వేగంగా ఆడడంతో సౌతాఫ్రికా నెగ్గుతుందనిపించింది. కానీ, ఆఖర్లో హెన్రీ మాయాజాలంతో.. దక్షిణాఫికా గెలుపు వాకిట బోల్తా పడింది.
ఇవి కూడా చదవండి
ఇండియన్ ట్రావెలర్స్‌కు అలర్ట్.. ఈ మార్పులు గురించి తప్పక తెలుసుకోండి..
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్.. స్ర్కీన్ టైం తగ్గించుకోకపోతే ఈ చర్మ సమస్యలు..!