New Zealand Clinches: కివీస్ ఉత్కంఠ గెలుపు
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:23 AM
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ తొమ్మిది పరుగులతో ఉత్కంఠ విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్..
వెస్టిండీస్‌తో మూడో టీ20
నెల్సన్ (న్యూజిలాండ్) : వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ తొమ్మిది పరుగులతో ఉత్కంఠ విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 177/9 స్కోరు చేసింది. కాన్వే (56), మిచెల్ (41) సత్తా చాటారు. అనంతరం విండీస్ 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. స్ర్పింగర్ (39), అథనజె (31) రాణించారు. సోథి, డఫీ చెరో మూడు వికెట్లు తీశారు.