National Sports Bill: ఈసీ సభ్యుడిగా ఒకసారి సరిపోతుంది!
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:11 AM
జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీ చేయాలంటే..గతంలో ఆయా సమాఖ్యల ఎగ్జిక్యూటివ్ కమిటీలలో రెండుసార్లు సభ్యుడిగా ఉండాల్సి వచ్చేది
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీ చేయాలంటే..గతంలో ఆయా సమాఖ్యల ఎగ్జిక్యూటివ్ కమిటీలలో రెండుసార్లు సభ్యుడిగా ఉండాల్సి వచ్చేది. కానీ పార్లమెంట్ ఆమోదించిన నూతన జాతీయ క్రీడా పరిపాలన బిల్లు ప్రకారం ఒక్కసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తే చాలు. యువ క్రీడా పరిపాలకులు, నాయకత్వ లక్షణాలు కలిగిన అథ్లెట్లను ప్రోత్సహించేందుకే ‘రెండు టర్మ్’లను ఒకటికి కుదించినట్టు కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవ్య వెల్లడించారు. జాతీయ క్రీడా పరిపాలన బిల్లును ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. రాష్ట్రపతి సంతకం చేశాక ‘కొత్త బిల్లు’ చట్టంగా మారనుంది.