గోల్డెన్ స్పైక్ విజేత చోప్రా
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:29 AM
డైమండ్ లీగ్ నెగ్గిన జోరుమీదున్న వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా వరుసగా రెండో టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. మంగళవారం జరిగిన...
ఓస్ట్రావా (చెక్ రిపబ్లిక్): డైమండ్ లీగ్ నెగ్గిన జోరుమీదున్న వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా వరుసగా రెండో టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. మంగళవారం జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ ఈవెంట్‌లో జావెలిన్‌ను మూడో త్రోలో 85.29 మీటర్ల దూరం విసిరిన నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టైటిల్ నెగ్గడం చోప్రాకిదే తొలిసారి. మొత్తం 9 మంది టాప్ అథ్లెట్లు పోటీపడ్డ ఈ మెగా ఈవెంట్‌లో దక్షిణాఫ్రికా త్రోయర్ డౌ స్మిత్ (84.12 మీ.) రెండో స్థానంలో, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ (83.63 మీ.) మూడో స్థానంలో నిలిచారు.
ఇవీ చదవండి:
గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి