Diamond League: సెలీసియా డైమండ్ లీగ్‌లో నీరజ్ అర్షద్ అమీతుమీ
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:33 AM
క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరమే. అది ఇప్పుడు జావెలిన్ త్రో క్రీడకు కూడా పాకింది. వచ్చే నెల 16న పోలెండ్‌లోని సెలీసియాలో జరిగే...
సెలీసియా (పోలెండ్): క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరమే. అది ఇప్పుడు జావెలిన్ త్రో క్రీడకు కూడా పాకింది. వచ్చే నెల 16న పోలెండ్‌లోని సెలీసియాలో జరిగే డైమండ్ లీగ్‌లో వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (పాకిస్థాన్) తలపడనున్నారు. పారిస్ విశ్వక్రీడల తర్వాత వీరిద్దరూ పోటీపడడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది గాయంతో అర్షద్ కొన్నాళ్లు టోర్నీలకు దూరం కాగా.. నీరజ్ వరుస టైటిళ్లతో ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. నిరుడు పారిస్ విశ్వక్రీడల్లో అర్షద్ స్వర్ణం గెలిస్తే, నీరజ్ రజతంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి