Share News

Nava Limited: నవ లిమిటెడ్‌ లాభం రూ.303 కోట్లు

ABN , Publish Date - May 17 , 2025 | 02:37 AM

నవ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.303 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మెటల్స్‌, మైనింగ్‌, ఇంధన విభాగాలు మెరుగైన పనితీరుతో వృద్ధికి దోహదం చేశాయి.

Nava Limited: నవ లిమిటెడ్‌ లాభం రూ.303 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నవ లిమిటెడ్‌.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,055.80 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.302.80 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలం తో పోల్చితే ఆదాయం 10.9 శాతం పెరగగా లాభం 18.8 శాతం వృద్ధి చెందింది. మార్చితో ముగిసిన పూర్తి సంవత్సరానికి గాను కంపెనీ రూ.4,135.20 కోట్ల ఆదాయంపై రూ.1,434 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఒక్కో షేరుకు రూ.6 తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గతంలో ప్రకటించిన రూ.4 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనమని పేర్కొంది.

అన్ని విభాగాల్లో మెరుగైన వృద్ధి: గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి చెందిన మెటల్స్‌, మైనింగ్‌, ఇంధన విభాగాలు అత్యుత్తమ పనితీరును కనబరచటం తో మంచి వృద్ధిని నమోదు చేసినట్లు నవ లిమిటెడ్‌ సీఈ ఓ అశ్విన్‌ దేవినేని వెల్లడించారు. కాగా మార్చి త్రైమాసికంలో అనుబంధ సంస్థ నవభారత్‌ ప్రాజెక్ట్స్‌ నుంచి రూ.30.4 కోట్ల డివిడెండ్‌ను అందుకున్నట్లు ఆయన చెప్పా రు. దీంతో 2024-25లో అనుబంధ సంస్థల నుంచి అందుకున్న డివిడెండ్‌ రూ.114.30 కోట్లకు చేరుకుందన్నారు.

Updated Date - May 17 , 2025 | 02:38 AM