ఉప్పొంగిన దేశభక్తి
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:47 AM
ఐపీఎల్ ముగింపోత్సవంలో దేశభక్తి, జాతీయ భావం పెల్లుబికింది. ‘సబ్‌సే ఆగే హోంగే హిందుస్థానీ’, దుష్మన్‌కే చక్కే చుడాదే, హమ్ ఇండియావాలే’ లాంటి పాటలతో స్టేడియం మొత్తం హుషారెత్తింది. ‘సైన్యానికి సెల్యూట్’...
విరాట్.. విరాట్..
ఐపీఎల్ ముగింపోత్సవంలో దేశభక్తి, జాతీయ భావం పెల్లుబికింది. ‘సబ్‌సే ఆగే హోంగే హిందుస్థానీ’, దుష్మన్‌కే చక్కే చుడాదే, హమ్ ఇండియావాలే’ లాంటి పాటలతో స్టేడియం మొత్తం హుషారెత్తింది. ‘సైన్యానికి సెల్యూట్’ ‘భారత భద్రతా దళాలకు ధన్యవాదాలు’ లాంటి సందేశాలు స్టేడియంలోని డిజిటల్ బోర్డులపై ప్రముఖంగా డిస్‌ప్లే చేశారు. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్, అతడి కుమారులు సిద్దార్థ్, శివం తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. లక్ష్య సినిమా సాంగ్స్‌తోపాటు రహమాన్ పాడిన ‘వందే మాతరం’తో జోష్‌ను తారస్థాయికి తీసుకెళ్లారు. ‘సబ్‌సే ఆగే హోంగే హిందుస్థానీ’తో కార్యక్రమాన్ని ముగించారు.

ఫైనల్ మ్యాచ్ కోసం స్టేడియానికి ఫ్యాన్స్ పోటెత్తారు. రికార్డు స్థాయిలో 90,871 మంది హాజరయ్యారు. స్టాండ్స్‌లో ఎక్కువగా బెంగళూరు జెర్సీలే కనిపించాయి. మ్యాచ్ ఆద్యంతం స్టేడియం మొత్తం విరాట్.. విరాట్.. విరాట్.. అన్న నినాదాలతో మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌కు బెంగళూరు జట్టు మాజీ స్టార్లు క్రిస్ గేల్, డివిల్లీర్స్ కూడా హాజరై ఆర్సీబీకి మద్దతుపలికారు. జట్టు గెలిచిన అనంతరం గేల్, డివిల్లీర్స్.. విరాట్ కోహ్లీని హత్తుకున్నారు.
1
ఐపీఎల్‌లో ఒకే జట్టుపై ఎక్కువ పరుగులు (పంజాబ్‌పై 1159) చేసిన బ్యాటర్‌గా విరాట్