Share News

Namibia Stuns South Africa: నమీబియా సంచలనం

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:44 AM

టీ20ల్లో పసికూన నమీబియా సంచలనం సృష్టించింది. శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో నమీబియా...

Namibia Stuns South Africa: నమీబియా సంచలనం

  • ఏకైక టీ20లో సౌతాఫ్రికాకు షాక్‌

విండ్‌హోక్‌ (నమీబియా): టీ20ల్లో పసికూన నమీబియా సంచలనం సృష్టించింది. శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో నమీబియా నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికాకు షాకిచ్చి అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్‌లో నమీబియా విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. జేన్‌ గ్రీన్‌ (30 నాటౌట్‌) సిక్స్‌, ఫోర్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలుత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. జాసన్‌ స్మిత్‌ 31, రూబిన్‌ హెర్మన్‌ 23 రన్స్‌ చేశారు. పేసర్‌ రూబెన్‌ ట్రంపెల్మన్‌ 3, హీంగో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో నమీబియా ఓవర్లన్నీ ఆడి 138/6 స్కోరు చేసి గెలిచింది. గ్రీన్‌కు తోడు కెప్టెన్‌ ఎరాస్మస్‌ (21) రాణించాడు.

Updated Date - Oct 12 , 2025 | 04:44 AM