Gautam Gambhir: నా భవిష్యత్ బీసీసీఐ చేతుల్లో
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:05 AM
సొంతగడ్డపై వరుసగా రెండో వైట్‌వాష్ కావడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ దారుణ వైఫల్యానికి తాను...
సొంతగడ్డపై వరుసగా రెండో వైట్‌వాష్ కావడంతో కోచ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ దారుణ వైఫల్యానికి తాను సహా అందరూ బాధ్యులేనని గౌతీ అన్నాడు. తన భవిష్యత్‌ను బీసీసీఐ నిర్ణయిస్తుందని చెప్పాడు. ‘భారత క్రికెట్ కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. యువ జట్టుతోనే ఇంగ్లండ్‌లో సిరీస్ డ్రా చేసుకొన్నప్పుడు కూడా అక్కడ ఉన్నది నేనే. నా హయాంలోనే చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచారన్న విషయాన్ని గుర్తుంచుకోవాల’ని చెప్పాడు. కివీస్‌తో సిరీ్‌సలో ఎంతో అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నారన్న విషయాన్ని గౌతీ నర్మగర్భంగా చెప్పాడు. అయితే, ఇప్పటి టాపార్డర్ బ్యాటర్లు కొందరికి 15 టెస్ట్‌లు ఆడిన అనుభవం కూడా లేదని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!