‘టాప్’ దిశగా ముంబై
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:00 AM
సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగేసింది....

డబ్ల్యూపీఎల్‌లో నేడు
ముంబై X బెంగళూరు
ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై గెలుపు
ముంబై: సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన ముంబై ఆ దిశగా అడుగేసింది. సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో 9 పరుగులతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (54) హాఫ్ సెంచరీ చేయగా, నాట్ సివర్ బ్రంట్ (38) సత్తా చాటింది. ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 170 రన్స్‌కు ఆలౌటైంది. భారతీ ఫుల్‌మాలీ (61) అర్ధ శతకంతో పోరాడింది. హర్మన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ విజయంతో ముంబై (10 పాయింట్లు) రెండో స్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ ముంబై గెలిస్తే టేబుల్ టాపర్‌గా నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. కాగా..ఢిల్లీ, ముంబై, గుజరాత్ ఇప్పటికే ఫ్లేఆ్‌ఫ్సకు చేరిన సంగతి తెలిసిందే.
సంక్షిప్తస్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 179/6 (హర్మన్ 54, నాట్ సివర్ 38, అమన్‌జోత్ 27, హేలీ మాథ్యూస్ 27, ప్రియా మిశ్రా 1/23);
గుజరాత్: 20 ఓవర్లలో 170 ఆలౌట్ (ఫుల్‌మాలీ 61, హర్లీన్ 24, కెర్ 3/34, హేలీ మాథ్యూస్ 3/38, షబ్నిమ్ 2/17).
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..