Share News

Inspiration: మహిళల క్రికెట్‌ ముఖచిత్రం.. మిథాలీ

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:54 AM

గవాస్కర్‌, టెండూల్కర్‌, ధోనీ, కోహ్లీ, రోహిత్‌ తదితరులను క్రికెట్‌ దేవుళ్లుగా ఆరాధించే మన దేశంలో ఒకప్పుడు మహిళల క్రికెట్‌పై అంతులేని వివక్ష ఉండేది.

Inspiration: మహిళల క్రికెట్‌ ముఖచిత్రం.. మిథాలీ

గవాస్కర్‌, టెండూల్కర్‌, ధోనీ, కోహ్లీ, రోహిత్‌ తదితరులను క్రికెట్‌ దేవుళ్లుగా ఆరాధించే మన దేశంలో ఒకప్పుడు మహిళల క్రికెట్‌పై అంతులేని వివక్ష ఉండేది. ప్రభుత్వ ప్రోత్సాహం గానీ, ప్రైవేట్‌ స్పాన్సర్‌షి్‌పలుగానీ లేని ఆ కాలంలో అమ్మాయిలు క్రికెట్‌ ఆడడమే విడ్డూరంగా ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే స్థాయికి ఎదిగింది. ఇవాళ దేశంలో పురుషులతో సమానంగా మహిళల మ్యాచ్‌లకూ క్రికెట్‌ స్టేడియాలు నిండుతున్నాయి.. మెగా టోర్నీల్లో మనమ్మాయిలు ట్రోఫీలు గెలుస్తున్నారు.. తాజాగా హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలో భారత సీనియర్‌ జట్టు వన్డే ప్రపంచ చాంపియన్‌గా నిలవడం. ఇలా.. రోజురోజుకూ మహిళా క్రికెట్‌ అత్యున్నత స్థాయికి ఎదగడం వెనక ఉన్న వ్యక్తి, శక్తి మిథాలీ రాజ్‌. తన కెరీర్‌నే సోపానంగా మలచి దేశ క్రికెట్‌ భవిష్యత్తును నిర్మించే అవకాశం దక్కించుకున్న నిఖార్సయిన క్రీడాకారిణి మిథాలీ. సుదీర్ఘంగా 23 ఏళ్ల పాటు కొనసాగిన తన దిగ్విజయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, రికార్డులు అందుకుంది మిథాలీ. ప్రపంచకప్‌లో రెండుసార్లు (2005, 2017) జట్టును ఫైనల్స్‌ దాకా తీసుకెళ్లి భారత మహిళా క్రికెట్‌కు గౌరవాన్ని, స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది. ధోనీతో సమానంగా మహిళల కెప్టెన్‌గా ఖ్యాతి గడించింది. అంచలంచెలుగా ఎదిగి మహిళల క్రికెట్‌కు ముఖచిత్రంగా మారింది. ఇవాళ.. వన్డే ప్రపంచ కప్‌ చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులోని సభ్యుల్లో దాదాపు అందరికీ మిథాలీనే ఆదర్శం. గతంలో మిథాలీ వేసిన పునాదికి ఇప్పుడు ప్రపంచ కప్‌ విజేత రూపంలో ప్రతిఫలం దక్కిందనుకోవచ్చు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - Nov 03 , 2025 | 03:57 AM