మ్యాక్స్‌వెల్ స్థానంలో ఓవెన్
ABN , Publish Date - May 05 , 2025 | 04:41 AM
గాయంతో ఐపీఎల్‌కు దూరమైన మ్యాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌ను ఎంపిక చేసినట్టు పంజాబ్ కింగ్స్ జట్టు ప్రకటించింది...
న్యూఢిల్లీ: గాయంతో ఐపీఎల్‌కు దూరమైన మ్యాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌ను ఎంపిక చేసినట్టు పంజాబ్ కింగ్స్ జట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓవెన్.. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావల్ జల్మి జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈనెల 9న ఆ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాక ఓవెన్ ఐపీఎల్‌లో భాగం కానున్నాడు. 23 ఏళ్ల ఓవెన్ గతేడాది బిగ్‌బాష్ లీగ్‌లో 452 పరుగులతో టాప్‌లో నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..