Share News

జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌ ముఖ్యమా

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:53 AM

ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియాపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆసీస్‌ మాజీ పేసర్‌, కామెంటేటర్‌...

జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌ ముఖ్యమా

ఆసీస్‌ బౌలర్లపై జాన్సన్‌ ఆగ్రహం

మెల్‌బోర్న్‌: ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియాపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆసీస్‌ మాజీ పేసర్‌, కామెంటేటర్‌ మిచెల్‌ జాన్సన్‌ జట్టు బౌలింగ్‌ విభాగంపై నిప్పులు చెరిగాడు. పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, హాజెల్‌వుడ్‌, స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌కు భవిష్యత్‌లో జట్టులో చోటు కల్పించకూడదని తేల్చేశాడు. పైగా..తమ బౌలర్లంతా జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్‌కు ప్రాధాన్యమివ్వడాన్ని జాన్సన్‌ ఆక్షేపించాడు. ముఖ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో కేవలం రెండు వికెట్లే తీసిన పేసర్‌ హాజెల్‌వుడ్‌ను తప్పుపట్టాడు. భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం కారణంగా కొద్దిరోజులు వాయిదాపడి పునఃప్రారంభమైన ఐపీఎల్‌లో పాల్గొనేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు హాజెల్‌వుడ్‌ గాయాన్ని లెక్క చేయకుం డా స్వదేశం నుంచి మళ్లీ భారత్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ‘స్టార్క్‌, కమిన్స్‌, హాజెల్‌వుడ్‌, లియాన్‌తో కూడిన మా ‘బిగ్‌ ఫోర్‌’ బౌలింగ్‌ విభాగం వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో విఫలం కావడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వారికి భవిష్యత్‌లో జట్టులో చోటు గ్యారెంటీ కాకూడదు. జట్టులో యువ రక్తాన్ని నింపడంపై సెలెక్టర్లు దృష్టి సారించాలి’ అని మిచెల్‌ జాన్సన్‌ సూచించాడు.

ఇవీ చదవండి:

ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నీలు

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 03:53 AM