World Aquatics Championships: మెకింటోష్ హ్యాట్రిక్
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:26 AM
కెనడా సంచలన స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ ప్రపంచ అక్వాటిక్ చాంపియన్‌షి్‌ప్సలో అదరగొడుతోంది.
ప్రపంచ అక్వాటిక్ చాంపియన్‌షిప్
సింగపూర్ : కెనడా సంచలన స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ ప్రపంచ అక్వాటిక్ చాంపియన్‌షి్‌ప్సలో అదరగొడుతోంది. ఈ పోటీల్లో ఆమె మూడో స్వర్ణం కొల్లగొట్టింది. గురువారం జరిగిన మహిళల 200 మీ. బటర్‌ఫ్లైలో 18 ఏళ్ల మెకింటోష్ అగ్రస్థానంలో నిలిచింది. కాగా..ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో మెకింటోష్ ఇప్పటికే 400 మీ. ఫ్రీస్టయిల్, 200 మీ. వ్యక్తిగత మెడ్లేలో స్వర్ణాలు నెగ్గింది. ఈక్రమంలో ఐదు స్వర్ణాల మైకేల్ పెల్ప్స్ రికార్డుకు ఆమె గురి పెట్టింది.