Share News

కెప్టెన్సీ సమయంలో జుత్తు ఊడిపోయింది

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:57 AM

శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసింది. మంగళవారం నుంచి బంగ్లాదేశ్‌తో గాలెలో జరిగే టెస్టు అతడి కెరీర్‌లో...

కెప్టెన్సీ సమయంలో జుత్తు ఊడిపోయింది

లంక ఆల్‌రౌండర్‌ మాథ్యూస్‌

గాలె: శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసింది. మంగళవారం నుంచి బంగ్లాదేశ్‌తో గాలెలో జరిగే టెస్టు అతడి కెరీర్‌లో చివరిది. 25 ఏళ్లకే సారథిగా బాధ్యతలు చేపట్టిన మాథ్యూస్‌ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. అయితే, సారథ్యం చేపట్టిన తర్వాత తన జుత్తు ఎంతో ఊడిపోయిందన్నాడు. ‘జట్టు పగ్గాలు అందుకొన్న తర్వాత జుత్తు బాగా రాలిపోయింది. ప్రతి కెప్టెన్‌ పరిస్థితి ఇంతే. దేశానికి ప్రాతినిథ్యం వహించడం వేరు.. సారథ్యం వహించడం వేరు. ప్రతీసారి అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. దృష్టంతా మనమీదే ఉంటుంది. మనం ఏం మాట్లాడతామో వినాలనుకొంటారు. కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా.. ఎంతో ఆస్వాదించా. విమర్శలను తట్టుకోలేక సారథ్యం వదిలేయాలని అనుకొనే వాడిని. కానీ, జట్టును మరోస్థాయికి తీసుకెళ్లడానికి అవకాశం వచ్చిందని నాకు నేను నచ్చజెప్పుకొనే వాడిన’ని మాథ్యూస్‌ తెలిపాడు.

ఇవీ చదవండి:

ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నీలు

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 03:57 AM