Share News

నీ కోసమే వచ్చాం..

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:01 AM

ప్రముఖ యూట్యూబర్‌, ఆర్జే మహ్‌వశ్‌ ఐపీఎల్‌లో ఇప్పుడు సందడి చేస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలకు బలం చేకూరుస్తూ...

నీ కోసమే వచ్చాం..

న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్‌, ఆర్జే మహ్‌వశ్‌ ఐపీఎల్‌లో ఇప్పుడు సందడి చేస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలకు బలం చేకూరుస్తూ అతనాడే ప్రతి మ్యాచ్‌కూ హాజరవుతోంది. చండీగఢ్‌లో మంగళవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ కనిపించిన మహ్‌వశ్‌.. ఇక్కడికి నీకోసమే వచ్చానంటూ చాహల్‌తో దిగిన సెల్ఫీతో పాటు స్నేహితులతో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘నీ వెనకాల ఉండి మద్దతిచ్చే వారిలో మేమున్నాం. నీకోసమే ఇక్కడికి వచ్చాం’ అని ఆ ఫొటోల కింద రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ను లైక్‌ చేసిన చాహల్‌.. మీరే నా వెన్నెముక అంటూ ఆ ఫొటోలకు కామెంట్‌ పెట్టాడు. గతంలో కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మను పెళ్లాడిన చాహల్‌.. ఇటీవలే ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి యాడ్స్, ప్రమోషన్స్ తొలగింపు.. కారణం ఏంటి

IPL 2025, GT vs RR: అండర్‌డాగ్స్ పోరులో విజేత ఎవరు.. గుజరాత్‌కు రాజస్తాన్ బ్రేక్‌లు వేస్తుందా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2025 | 03:04 AM