లఖ్‌నవూ ఇంటికి
ABN , Publish Date - May 20 , 2025 | 04:14 AM
ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పోరాటం కూడా ముగిసింది. ప్లేఆ్‌ఫ్సలో మిగిలిన ఒక్క బెర్త్ కోసం రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఎల్‌ఎ్‌సజీ బోల్తా పడింది...
నేటి మ్యాచ్
చెన్నై X రాజస్థాన్
వేదిక : ఢిల్లీ, రా.7.30 నుంచి
సన్‌రైజర్స్ చేతిలో ఓటమి
ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్
అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్
లఖ్‌నవూ: ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పోరాటం కూడా ముగిసింది. ప్లేఆ్‌ఫ్సలో మిగిలిన ఒక్క బెర్త్ కోసం రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఎల్‌ఎ్‌సజీ బోల్తా పడింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లతో ఓడింది. దీంతో 12 మ్యాచ్‌లు 10 పాయింట్లతో అధికారికంగా పంత్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. అటు భారీ ఛేదనలో అభిషేక్ శర్మ (20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 59)తో పాటు రైజర్స్ బ్యాటర్లు కలిసికట్టుగా కదం తొక్కడంతో వీరికి నాలుగో విజయం దక్కింది. ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మార్ష్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65), మార్‌క్రమ్ (38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61) అర్ధసెంచరీలు సాధింగా, పూరన్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) ఆకట్టుకున్నాడు. ఎషాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 రన్స్ చేసి గెలిచింది. క్లాసెన్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47), ఇషాన్ (28 బంతు ల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), కమిందు (21 బంతుల్లో 3 ఫోర్లతో 32 రిటైర్డ్ హర్ట్) రాణించారు. దిగ్వేష్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అభిషేక్ నిలిచాడు.
చెలరేగిన అభిషేక్: భారీ ఛేదనలో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఆటను ప్రదర్శించగా, మిగతా బ్యాటర్లంతా సహకారమందించారు. ఇక హెడ్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అధర్వ (13) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగినా శర్మ మాత్రం జోరు ఆపలేదు. మూడో ఓవర్‌లో 4,6,4తో 17 రన్స్ అందించాడు. ఓరౌర్కీ ఓవర్‌లోనూ 4,6 బాదడంతో పవర్‌ప్లేలో స్కోరు 72/1కి చేరింది. ఆ తర్వాత కూడా అభిషేక్ ఎదురుదాడి ఆగలేదు. బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లతో 26 రన్స్ రాబట్టడంతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తయ్యింది. ప్రమాదకరంగా మారిన తనను దిగ్వేష్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు ఇషాన్‌తో 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మార్‌క్రమ్ ఓవర్‌లో 4,6 బాదిన ఇషాన్‌ను దిగ్వేష్ అవుట్ చేశాడు. అయితే క్లాసెన్ చెలరేగి లక్ష్యాన్ని సులువు చేశాడు. కమిందు సహకారం అందిస్తూ 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అయితే రెండు వరుస ఫోర్ల తర్వాత క్లాసెన్‌ను శార్దూల్ అవుట్ చేసినా అప్పటికి సమీకరణం 15 బంతుల్లో 11 పరుగులే కావడంతో రైజర్స్ విజయానికి ఇబ్బంది లేకుండా పోయింది.
ఓపెనర్ల శతక భాగస్వామ్యం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు మార్ష్, మార్‌క్రమ్ అదిరే ఆరంభాన్ని అందించారు. తొలి పది ఓవర్లపాటు రైజర్స్ బౌలర్లపై ఈ జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వీరి జోరు చూస్తే స్కోరు సునాయాసంగా 220 దాటుతుందనిపించింది. కానీ డెత్ ఓవర్లలో 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. పూరన్ దాదాపు చివరిదాకా ఉన్నా 200+ స్కోరు కోసం కష్టపడాల్సి వచ్చింది. మొదట్లో మార్ష్ దూకుడు కనబరుస్తూ తొలి ఓవర్‌లో 4,6.. రెండో ఓవర్‌లో మరో సిక్సర్ బాదాడు. అటు స్పిన్నర్ హర్ష్ దూబే ఓవర్‌లో మార్‌క్రమ్ 6,4తో జోరు చూపాడు. వీరి బౌండరీల ధాటికి పవర్‌ప్లేలో జట్టు 69 పరుగులకు చేరింది. అలాగే 28 బంతుల్లో మార్ష్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో ఓవర్‌లో మార్‌క్రమ్ క్యాచ్‌ను అనికేత్ వదిలేశాడు. అదే ఓవర్‌లో జట్టు స్కోరు వందకి చేరింది. ఇక తర్వాతి ఓవర్‌లో మార్ష్ ఆడిన బంతిని హర్షల్ రిటర్న్ క్యాచ్ తీసుకున్నా.. రీప్లేలో బంతి నేలకు తాకినట్టు తేలడంతో బతికిపోయాడు. అయితే 11వ ఓవర్‌లో మార్ష్‌ను పెవిలియన్‌కు చేర్చిన హర్ష్ జట్టుకు రిలీ్‌ఫనిచ్చాడు. దీంతో 63 బంతుల్లో తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం ఎల్‌ఎ్‌సజీ తడబడింది. కెప్టెన్ పంత్ (7) ఎప్పటిలాగే నిరాశపర్చాడు. ఎషాన్ మలింగ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో అతడికి షాకిచ్చాడు. 16వ ఓవర్‌లో మార్‌క్రమ్ రెండు సిక్సర్లు బాది జోరు పెంచాలని చూసినా హర్షల్ అతడిని అవుట్ చేశాడు. అటు మలింగ రెండు పరుగులే ఇచ్చి హిట్టర్ బదోని (3)ని పెవిలియన్‌కు చేర్చాడు. ఇక ఆఖరి ఓవర్‌లో పూరన్, శార్దూల్ (4) రనౌట్ కాగా సమద్ (3)ను నితీశ్ బౌల్డ్ చేశాడు. అయినా ఆఖరి బంతికి ఆకాశ్ (6 నాటౌట్) సిక్సర్‌తో మురిపించాడు. మొత్తంగా చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు రావడంతో లఖ్‌నవూ స్కోరు 200 దాటగలిగింది.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: మార్ష్ (సి) మలింగ (బి) హర్ష్ దూబే 65, మార్‌క్రమ్ (బి) హర్షల్ 61, పంత్ (సి అండ్ బి) మలింగ 7, పూరన్ (రనౌట్) 45, బదోని (సి) నితీశ్ (బి) మలింగ 3, సమద్ (బి) నితీశ్ 3, శార్దూల్ (రనౌట్) 4, బిష్ణోయ్ (నాటౌట్) 0, ఆకాశ్‌దీప్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 205/7; వికెట్ల పతనం: 1-115, 2-124, 3-159, 4-169, 5-194, 6-199, 7-199; బౌలింగ్: కమిన్స్ 4-0-34-0, హర్ష్ దూబే 4-0-44-1, హర్షల్ 4-0-49-1, మలింగ 4-0-28-2, జీషన్ 2-0-22-0, నితీశ్ 2-0-28-1.
సన్‌రైజర్స్: అథర్వ (సి) దిగ్వేష్ (బి) ఓరౌర్కీ 13, అభిషేక్ శర్మ (సి) శార్దూల్ (బి) దిగ్వేష్ 59, ఇషాన్ (బి) దిగ్వేష్ 35, క్లాసెన్ (సి) పంత్ (బి) శార్దూల్ 47, మెండిస్ (రిటైర్డ్ హర్ట్) 32, అనికేత్ (నాటౌట్) 5, నితీశ్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 18.2 ఓవర్లలో 206/4; వికెట్ల పతనం: 1-17, 2-99, 3-140, 4-195, 4-197 (రిటైర్డ్ హర్ట్); బౌలింగ్: ఆకాశ్‌దీప్ 3-0-33-0, విల్ ఓరౌర్కీ 2.2-0-31-1, దిగ్వేష్ రాఠి 4-0-37-2, అవేశ్ 3-0-25-0, రవి బిష్ణోయ్ 1-0-26-0, మార్‌క్రమ్ 1-0-14-0, శార్దూల్ ఠాకూర్ 4-0-39-1.
దిగ్వే్‌షగీఅభిషేక్
రైజర్స్ ఓపెనర్ అభిషేక్.. లఖ్‌నవూ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. 8వ ఓవర్‌లో అతడిని అవుట్ చేసిన రాఠీ అతడిని వెళ్లిపో అన్నట్టు చేతులు ఊపుతూ సిగ్నేచర్ స్టయిల్లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో డగౌట్‌కు వెళుతున్న అభిషేక్ వెనక్కి రాగా.. దిగ్వేష్ కూడా ఏమిటంటూ ముందుకు వెళ్లాడు. వెంటనే అంపైర్లు కలుగజేసుకుని ఇద్దరినీ శాంతింపచేశారు. ఆ తర్వాత ఇషాన్‌ను అవుట్ చేశాక కూడా రాఠీ డగౌట్ వైపు చూపిస్తూ చేతులు ఊపడం కనిపించింది.
1
ఐపీఎల్‌లో తక్కువ బంతుల్లో (2381)నే 150 వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్.
1
ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు (మార్ష్, మార్‌క్రమ్, పూరన్) 400+ స్కోర్లు నమోదు చేయడం ఇదే తొలిసారి.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
గుజరాత్ 12 9 3 0 18 0.795
బెంగళూరు 12 8 3 1 17 0.482
పంజాబ్ 12 8 3 1 17 0.389
ముంబై 12 7 5 0 14 1.156
ఢిల్లీ 12 6 5 1 13 0.260
కోల్‌కతా 13 5 6 2 12 0.193
లఖ్‌నవూ 12 5 7 0 10 -0.506
హైదరాబాద్ 12 4 7 1 9 -1.005
రాజస్థాన్ 13 3 10 0 6 -0.701
చెన్నై 12 3 9 0 6 -0.992
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..