Share News

Lionel Messi: భారత్‌లో మెస్సీ పర్యటన ఖరారు

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:56 AM

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ భారత పర్యటన అధికారికంగా ఖరారైంది.

Lionel Messi: భారత్‌లో మెస్సీ పర్యటన ఖరారు

కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ భారత పర్యటన అధికారికంగా ఖరారైంది. నాలుగు రోజుల ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రమోటర్లు శుక్రవారం వెల్లడించారు.

డిసెంబరు 12: రాత్రికి కోల్‌కతా చేరుకోనున్న మెస్సీ.


డిసెంబరు 13: ఉదయం ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం. అనంతరం మెస్సీ విగ్రహావిష్కరణ. సాల్ట్‌లేక్‌ లేదా ఈడెన్‌ గార్డెన్స్‌లో గోట్‌ కన్సర్ట్‌, గోట్‌ కప్‌. మెస్సీ కుడ్య చిత్రాన్ని (25 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు) గోట్‌ కన్సర్ట్‌ సందర్భంగా అతడికి ప్రదానం చేస్తారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో గంగూలీ, లియాండర్‌ పేస్‌, బైచుంగ్‌ భూటియా, జాన్‌ అబ్రహంతో కూడిన జట్టుతో కలిసి మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడతాడు. సాయంత్రం అహ్మదాబాద్‌ వెళ్లి అదానీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటాడు.

డిసెంబరు 14: ముంబై బ్రబౌర్న్‌ స్టేడియంలో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’. షారుఖ్‌ ఖాన్‌, లియాండర్‌ పేస్‌తో కలిసి మెస్సీ టెన్నిస్‌ ఆడతాడు. వాంఖడే స్టేడియంలో గోట్‌ కన్సర్ట్‌, గోట్‌ కప్‌. గోట్‌ కెప్టెన్ల సమావేశంలో భాగంగా సచిన్‌, ధోనీ, రోహిత్‌తో భేటీ.

డిసెంబరు15: న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం.

Updated Date - Aug 16 , 2025 | 07:35 AM