Share News

KL Rahul: ఇది నా గ్రౌండ్‌

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:11 AM

ఆర్‌సీబీపై విజయంతో కేఎల్‌ రాహుల్‌ బెంగళూరులో తన హోంగ్రౌండ్‌లో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాచ్ అనంతరం ‘కాంతారా’ స్టైల్‌లో బ్యాట్‌ సెలబ్రేషన్‌ చేస్తూ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచాడు

KL Rahul: ఇది నా గ్రౌండ్‌

మ్యాచ్‌ సంబరాలపై కేఎల్‌ రాహుల్‌

బెంగళూరు: ఆర్‌సీబీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను గట్టెక్కించింది. అయితే స్థానిక ఆటగాడైన రాహుల్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాక తీవ్ర ఉద్వేగంతో సంబరాలు చేసుకున్నాడు. ఇందులో భాగంగా తన బ్యాట్‌ను కాస్త పైకి లేపి గ్రౌండ్‌కి బలంగా ఆనించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే దీనిపై రాహుల్‌ వివరణ ఇస్తూ.. ‘ఈ మైదానం నాకెంతో ప్రత్యేకమైంది. ఇది నా హోంగ్రౌండ్‌. దీని గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? ఇక నాకెంతో ఇష్టమైన సినిమా కాంతారాలో మాదిరి బ్యాట్‌ సంబరాలు చేసుకున్నాను’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

Updated Date - Apr 12 , 2025 | 04:16 AM