మైదానంలో వీడ్కోలుకు ఆ ముగ్గురు అర్హులు
ABN , Publish Date - May 14 , 2025 | 04:17 AM
కొద్దిరోజుల వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తనను విస్మయానికి గురిచేసిందని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నాడు. అలాగే, వీళ్లు మైదానంలో వీడ్కోలు...
న్యూఢిల్లీ: కొద్దిరోజుల వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తనను విస్మయానికి గురిచేసిందని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నాడు. అలాగే, వీళ్లు మైదానంలో వీడ్కోలు పలికి ఉంటే బాగుండేదన్నాడు. ‘ఇద్దరు మేటి ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు టెస్టులకు గుడ్‌బై పలికారు. ముఖ్యంగా కోహ్లీ.. ఇంకా కొన్నేళ్లు టెస్టులు ఆడే సత్తా ఉన్నా కూడా, ఈ నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. ఇది ఒకరకంగా నిశ్శబ్ద నిష్క్రమణ. కానీ, మైదానంలో ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య వీడ్కోలు ప్రకటన చేస్తే ఎంత బాగుంటుంది? గతంలో అశ్విన్ కూడా అలాగే చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత్ వచ్చేసి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. నా దృష్టిలో ఈ ముగ్గురు మైదానంలో అభిమానుల మధ్య రిటైర్మెంట్ తీసుకునేందుకు వందశాతం అర్హులు’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..