Indian Spinner: టీ20 జట్టునుంచి కుల్దీప్ విడుదల
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:09 AM
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ జట్టు నుంచి విడుదల జేశారు.
హోబర్ట్: స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ జట్టు నుంచి విడుదల జేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈనెల ఆరునుంచి భారత్ ‘ఎ’-దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య బెంగళూరులో జరిగే రెండో అనధికార టెస్ట్‌లో కుల్దీప్ పాల్గొంటాడని తెలిపింది. దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీ్‌సకు సన్నాహకంలో భాగంగా కుల్దీప్‌ను భారత్ ‘ఎ’ జట్టు తరపున ఆడించాలని నిర్ణయించినట్టు వివరించింది.