Share News

కోహ్లీలో ఇంకా ఆడే సత్తావుంది

ABN , Publish Date - May 14 , 2025 | 04:15 AM

టెస్టుల్లో ఆడేందుకు విరాట్‌ కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలుందని భారత మాజీ వికెట్‌కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి అభిప్రాయపడ్డాడు. ‘ప్రతి ఒక్కరు ఆటలో రిటైర్‌ కావాల్సిందే...

కోహ్లీలో ఇంకా ఆడే సత్తావుంది

సయ్యద్‌ కిర్మాణి

న్యూఢిల్లీ: టెస్టుల్లో ఆడేందుకు విరాట్‌ కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్‌ మిగిలుందని భారత మాజీ వికెట్‌కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి అభిప్రాయపడ్డాడు. ‘ప్రతి ఒక్కరు ఆటలో రిటైర్‌ కావాల్సిందే. అయితే కోహ్లీ కొంచెం ముందుగా వీడ్కోలు పలికాడు. ఈ నిర్ణయం తీసుకునేందుకు అతడిపై ఎలాంటి ఒత్తిడీ లేదనుకుంటున్నా. భవిష్యత్‌లో అతడికి మంచి జరగాలని కోరుకుంటున్నా. విరాట్‌ నిలకడైన ఆటతీరే అతణ్ణి మిగిలిన వారికంటే భిన్నంగా నిలబెట్టింది. భావి క్రికెటర్లకు అతడొక ప్రేరణ’ అని కిర్మాణి చెప్పాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 04:15 AM