కెప్టెన్సీ మోయలేని భారంగా
ABN , Publish Date - May 07 , 2025 | 04:21 AM
కెప్టెన్సీ భారంతోపాటు తన బ్యాటింగ్‌పై నిరంతర సమీక్షలను తట్టుకోలేకపోయినట్టు విరాట్ కోహ్లీ చెప్పాడు. ఒత్తిడిలేకుండా ఆటపైనే దృష్టిసారించాలన్న ఆలోచనతోనే ఐపీఎల్‌లో సారథ్య బాధ్యతల నుంచి...
సారథ్యాన్ని వదులుకోవడంపై కోహ్లీ
బెంగళూరు: కెప్టెన్సీ భారంతోపాటు తన బ్యాటింగ్‌పై నిరంతర సమీక్షలను తట్టుకోలేకపోయినట్టు విరాట్ కోహ్లీ చెప్పాడు. ఒత్తిడిలేకుండా ఆటపైనే దృష్టిసారించాలన్న ఆలోచనతోనే ఐపీఎల్‌లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నట్టు ‘ఆర్‌సీబీ బోల్డ్ డైరీస్’ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ బయటపెట్టాడు. 2021 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీని వదులుకొన్న విరాట్...అనంతరం ఆర్‌సీబీ నాయకత్వానికి గుడ్‌బై చెప్పాడు. తర్వా తి ఏడాది దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టెస్టు పగ్గాలను వదిలేశాడు. ‘ఏడెనిమిదేళ్లు టీమిండియాకు, తొమ్మిదేళ్లు బెం గళూరుకు సారథ్యం వహించా. ప్రతిసారీ నాపైనే భారీ అంచనాలుండేవి. రాన్రాను పరిస్థితులు భారంగా మారాయి.. అదీ మోయలేనంతగా. అందుకే కెప్టెన్సీ వదిలి, ఆటను ఆస్వాదించాలన్న నిర్ణయానికి వచ్చా’ అని విరాట్ తెలిపాడు.
ఆ ఓటమి...హ్యాంగోవర్: 2019 వరల్డ్‌కప్ సెమీ్‌సలో ఓటమి తనకు ‘భయంకరమైన హ్యాంగోవర్’ లాంటిదన్నాడు. విరాట్ సారథ్యం వహించిన ఏకైక వన్డే వరల్డ్‌క్‌పలో లీగ్ దశలో అదరగొట్టిన భారత్.. సెమీ్‌సలో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. అయితే, ఆ ఓటమి బాధను దిగమింగుకోవడానికి చాలా కాలం పట్టిందన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..