Telugu athletes Kiran and Deepika: పారా క్రీడల్లో సత్తాచాటిన కిరణ్, దీపిక
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:04 AM
ఆసియా యూత్ పారా క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శ్రీ నికేష్ కిరణ్, విజయ దీపిక సత్తా చాటారు. దుబాయ్‌లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా యూత్ పారా క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శ్రీ నికేష్ కిరణ్, విజయ దీపిక సత్తా చాటారు. దుబాయ్‌లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో స్విమ్మర్ కిరణ్ మూడు పతకాలు సాధించాడు. స్విమ్మింగ్ ఎస్8 విభాగం 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో, 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాంస్య పతకాలు సాధించాడు. ఇక వీల్ చైర్ టేబుల్ టెన్నిస్‌లో హైదరాబాద్ అమ్మాయి విజయ దీపిక సింగిల్స్‌లో కాంస్యం, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది.