Retirement: టీ20లకు కేన్ వీడ్కోలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:59 AM
న్యూజిలాండ్ వెటరన్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని ప్రకటించాడు.
వన్డే, టెస్టులకు పరిమితం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వెటరన్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని ప్రకటించాడు. వెస్టిండీ్‌సతో ఐదు టీ20ల సిరీస్‌కు ముందు అతనీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని, జట్టు ఎంపికపై సెలెక్టర్లకు కూడా తగిన స్పష్టత వస్తుందని 35 ఏళ్ల కేన్ తెలిపాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్‌పై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. 2011లో టీ20ల్లో అరంగేట్రం చేసిన కేన్ 93 మ్యాచ్‌ల్లో 2575 రన్స్ సాధించాడు. అలాగే 75 టీ20ల్లో కెప్టెన్‌గా వ్యవహరించగా.. అతడి ఆధ్వర్యంలోనే కివీస్ టీ20 వరల్డ్‌కప్ 2016, 2022 సెమీ్‌సలో.. 2021 ఫైనల్లో తలపడింది. మరోవైపు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గతేడాది గుజరాత్‌కు ఆడగా.. 2025 సీజన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలాడు.