జ్యోతికి గాయం
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:33 AM
ఆసియా చాంపియన్, తెలుగు అథ్లెట్ యర్రాజి జ్యోతి మోకాలి గాయానికి గురైంది. సాధన చేస్తున్న సమయంలో తన మోకాలికి గాయమైందని జ్యోతి బుధవారం సోషల్ మీడియా ద్వారా తెలిపింది...
వరల్డ్ చాంపియన్‌షిప్ అవకాశాలు దూరం!
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్, తెలుగు అథ్లెట్ యర్రాజి జ్యోతి మోకాలి గాయానికి గురైంది. సాధన చేస్తున్న సమయంలో తన మోకాలికి గాయమైందని జ్యోతి బుధవారం సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు గ్రహీత అయిన 25 ఏళ్ల జ్యోతి.. ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించడమే లక్ష్యంగా కఠోరంగా శ్రమిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమె గాయానికి గురవడం ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత పతక అవకాశాలకు గండి పడినట్టే. ప్రపంచ టోర్నీ సెప్టెంబరు 13 నుంచి 21 వరకు టోక్యోలో జరగనుంది. జ్యోతి ప్రస్తుత గాయానికి సర్జరీ చేయాల్సిన అవసరముందని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించాలంటే 12.73 సెకన్ల టైమింగ్‌ను జ్యోతి అందుకోవాల్సి ఉంది. అలా కాకుండా ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా టోర్నీలో తలపడాలంటే జ్యోతి.. ప్రస్తుతం తన 12వ ర్యాంక్‌ను క్వాలిఫికేషన్స్‌కు కటాఫ్ తేదీ అయిన ఆగస్టు 24 దాకా కాపాడుకోవాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి