Jyothi Surekha: సురేఖ కంచు మోత
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:06 AM
చైనీస్ తైపీలో జరిగిన తైపీ ఆర్చరీ ఓపెన్‌లో వెన్నం జ్యోతి సురేఖ కంచు పతకం సాధించింది. ఇండోర్ కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగం....
న్యూఢిల్లీ: చైనీస్ తైపీలో జరిగిన తైపీ ఆర్చరీ ఓపెన్‌లో వెన్నం జ్యోతి సురేఖ కంచు పతకం సాధించింది. ఇండోర్ కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగం కాంస్య పోరులో సురేఖ 149-143తో సొ చెవాన్‌పై గెలిచింది. అంతకుముందు సెమీస్‌లో జ్యోతి 144-145తో మ్లినారిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడింది. ఇక, అండర్-21 కేటగిరిలో చికితరావు, జూనియర్ విభాగంలో గణేష్ పసిడి పతకాలు నెగ్గారు.