Archery World Cup: సురేఖ ట్రిపుల్
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:40 AM
కీలక తరుణంలో ఒత్తిడికి చిత్తయిన భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ త్రుటిలో రెండు స్వర్ణాలను చేజార్చుకొంది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4 పోటీల్లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం...
రెండు రజతాలు, ఓ కాంస్యం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4
మాడ్రిడ్: కీలక తరుణంలో ఒత్తిడికి చిత్తయిన భారత స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ త్రుటిలో రెండు స్వర్ణాలను చేజార్చుకొంది. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4 పోటీల్లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం సొంతం చేసుకొన్న విజయవాడ ఆర్చర్ జ్యోతి.. టీమ్ ఈవెంట్‌లో మరో రజతం సాధించింది. అయితే, మిక్స్‌డ్ కాంస్య పోరులో జ్యోతి ద్వయం విజయం సాధించింది. మొత్తంగా జ్యోతి సురేఖ ఒక్కరోజే రెండు రజతాలు, ఓ కాంస్యంతో కలిపి మూడు పతకాలు కొల్లగొట్టింది. ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-4లో శనివారం జరిగిన కాంపౌడ్ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 147-148తో ఎల్లా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో పరాజయం పాలై రజతంతో సరిపెట్టుకుంది. ఇక, మహిళల టీమ్ ఈవెంట్ టైటిల్‌పోరులో జ్యోతి, పర్ణీత్ కౌర్, ప్రీతిక ప్రదీ్‌పల త్రయం 225-227తో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓటమిపాలై రజతానికి పరిమితమైంది. మిక్స్‌డ్ కాంస్య పతక పోరులో జ్యోతి-రిషభ్ జంట 156-153తో ఎల్ సాల్వడార్‌కు చెందిన పౌలా-వ్లాదిమిర్ జోడీపై గెలిచింది.
ఇవీ చదవండి:
టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి