Archery World Cup 2025: ఫైనల్లో సురేఖ జోడీ
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:15 AM
భారత్‌కు ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 పోటీల్లో మూడో పతకం ఖరారైంది. జ్యోతి సురేఖ, రిషభ్ యాదవ్ జోడీ ఫైనల్‌కు చేరి కనీసం రజతం ఖాయం చేసుకుంది

న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 పోటీల్లో భారత్‌కు మూడో పతకం ఖరారైంది. ఈసారి తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, రిషభ్ యాదవ్ జోడీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లి కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ, రిషభ్ ద్వయం 159-155తో స్లోవేనియా జంటను ఓడించింది. శనివారం జరిగే తుదిపోరులో చైనీస్ తైపీతో సురేఖ జోడీ స్వర్ణం కోసం పోరాడనుంది.