Share News

జైషా ‘రికార్డు’ పర్యటన

ABN , Publish Date - Apr 21 , 2025 | 02:59 AM

ఐసీసీకి పిన్న వయస్సు (36 ఏళ్లు) చైర్మన్‌గా ఎన్నికై జైషా ఇప్పటికే రికార్డు సృష్టించారు. అలాగే ప్రపంచానికి పెద్దగా పరిచయంలేని ఆఫ్రికా దేశం బోట్స్‌వానాలో...

జైషా ‘రికార్డు’ పర్యటన

న్యూఢిల్లీ: ఐసీసీకి పిన్న వయస్సు (36 ఏళ్లు) చైర్మన్‌గా ఎన్నికై జైషా ఇప్పటికే రికార్డు సృష్టించారు. అలాగే ప్రపంచానికి పెద్దగా పరిచయంలేని ఆఫ్రికా దేశం బోట్స్‌వానాలో పర్యటించిన తొలి ఐసీసీ చీఫ్‌గా అతడు మరో ఘనత అందుకున్నాడు. ఇటీవల జింబాబ్వేలో జరిగిన ఐసీసీ సమావేశానికి జైషా హాజరయ్యాడు. అనంతరం జింబాబ్వే పక్క దేశమైన బోట్స్‌వానా వెళ్లాడు. ఆ దేశ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సుమోద్‌ దామోదర్‌తో భేటీ అయ్యాడు. బోట్స్‌వానాలో క్రికెట్‌ అభివృద్ధి గురించి దామోదర్‌తో చర్చించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 02:59 AM