Isha Singh Leads India to Silver: ఇషా బృందానికి రజతం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:47 AM
వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌ప 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇషా సింగ్ సారథ్యంలోని భారత మహిళల జట్టు రజతం నెగ్గగా.. యువ ఆటగాడు సమ్రాట్ రాణా టీమ్ ఈవెంట్‌తో పాటు...
కైరో: వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షి్‌ప 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇషా సింగ్ సారథ్యంలోని భారత మహిళల జట్టు రజతం నెగ్గగా.. యువ ఆటగాడు సమ్రాట్ రాణా టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత విభాగం స్వర్ణంతో డబుల్ ధమాకా సృష్టించాడు. సోమవారం జరిగిన పోటీల్లో ఇషా, మను భాకర్, సురుచిల బృందం మొత్తం 1740 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనాకు స్వర్ణం, కొరియాకు కాంస్యం దక్కాయి. 10 మీ. పురుషుల టీమ్ ఈవెంట్‌లో సమ్రాట్, వరుణ్ తోమర్, శ్రవణ్ త్రయం మొత్తం 1754 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇటలీ, జర్మనీ జట్లు రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకొన్నాయి. పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సమ్రాట్ 243.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం అందుకోగా.. వరుణ్ (221.7) కాంస్యం నెగ్గాడు. చైనా షూటర్ కై హు రజతం సాధించాడు.