Share News

బుమ్రా సిద్ధమేనా

ABN , Publish Date - Jun 29 , 2025 | 03:37 AM

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత్‌ సన్నాహకాల్లో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పేస్‌ దళపతి బుమ్రా రెండో రోజు తీవ్రంగా సాధన చేయడమే...

బుమ్రా సిద్ధమేనా

రెండోరోజు నెట్స్‌లో చెమటోడ్చిన పేసర్‌

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత్‌ సన్నాహకాల్లో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పేస్‌ దళపతి బుమ్రా రెండో రోజు తీవ్రంగా సాధన చేయడమే ఆ పరిణామం. పని భారం నిర్వహణలో భాగంగా..వచ్చే నెల 2 నుంచి ఇక్కడ జరిగే రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ శుక్రవారం, తొలిరోజు మిగిలిన జట్టంతా ప్రాక్టీస్‌ చేసినా బుమ్రా పాల్గొనలేదు. బుమ్రాతోపాటు మరో పేసర్‌ ప్రసిద్ధ్‌ కూడా మొదటి రోజు సాధనకు దూరంగా ఉన్నాడు. దాంతో పనిభారం నిర్వహణలో భాగంగా బుమ్రా వైదొలగుతాడని, తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోలేకపోయిన ప్రసిద్ధ్‌పై రెండో టెస్టుకు వేటు పడుతుందనే చర్చ మొదలైంది. అయితే ఈ సిరీ్‌సలో 0-1తో భారత్‌ వెనుకంజలో ఉన్న నేపథ్యంలో రెండో టెస్టులో బుమ్రా ఆడాల్సిన అవసరం ఎంతో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక..శనివారంనాటి ప్రాక్టీ్‌సలో పేస్‌ త్రయం బుమ్రా, సిరాజ్‌తోపాటు ప్రసిద్ధ్‌ శ్రమించారు. మొత్తంగా బుమ్రా ప్రాక్టీస్‌ చేయడంతో జట్టులో ఉత్సాహం నిండింది. కానీ రెండో టెస్టుకు తుది జట్టులో బుమ్రా ఉంటాడా అనే విషయమై స్పష్టత రాలేదు. ఇక..బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ రెండో రోజు సాధనలో తొలుత బ్యాటింగ్‌కు దిగాడు.

ఇవీ చదవండి:

డేంజరస్ సెలబ్రేషన్.. పంత్‌ పరిస్థితేంటి..

కోచ్‌తో భారత స్టార్ల కొట్లాట

రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 03:37 AM