MI vs SRH: హైదరాబాద్‌కు షాక్.. ముంబై ఘన విజయం
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:33 PM
ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. 6 వికెట్లు కోల్పోయి 163 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది
ఐపీఎల్ తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ మరోసారి ఓటమి చవి చూసింది. 163 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. హైదరాబాద్‌కు ఇది ఐదో పరాజయం కాగా ముంబైకి ఇది మూడో విజయం.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. ముంబై బౌలర్ల ధాటికి కాస్త తడబడింది. కేవలం 162 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (40), హెన్రిచ్ క్లాసెస్ (37) మాత్రమే ఫరవాలేదనిపించారు. మందకొడి ఆటతో ట్రావిస్ హెడ్ (28), సింగిల్ డిజిట్ స్కోరుతో ఇషాన్ కిషన్ (2) నిరాశపరిచారు. చివరి ఓవర్‌లో అనికేత్ వర్మ్ రెండు సిక్సులు బాదడంతో స్కోరు ఓ మోస్తరు స్థాయికి చేరుకుంది. ముంబై బౌలర్లు విల్ జాక్స్ రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు. చివరకు హైదరాబాద్ 20 ఓవర్లలో ఐదు వికెట్లో కోల్పోయి 162 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టులో ర్యాన్ రికెల్టన్ (31), విల్ జాక్స్ (36), రోహిత్ శర్మ (26), సూర్యకమార్ (26), హార్దిక్ పాండ్యా (21) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించారు. బౌలింగ్‌లో వెనక పడ్డ హైదరాబాద్ చివరకు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు, ఎషాన్ మలింగ రెండు వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..