Share News

IPL 2025 GT vs SRH: 224 పరుగులకు గుజరాత్ ఆలౌట్.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2025 | 09:41 PM

సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ చెలరేగి ఆడింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

IPL 2025 GT vs SRH: 224 పరుగులకు గుజరాత్ ఆలౌట్.. హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం
IPL 2025 GT vs SRH

సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇరగదీసింది. శుభ్‌మన్ గిల్, బట్లర్‌లు రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 భారీ స్కోరు చేసింది. శుభమన్ గిల్ (38 బంతుల్లో 76 పరుగులు), బట్లర్ (37 బంతుల్లో 64 పరుగులతో) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హాఫ్ సెంచరీలతో జట్టుకు కీలకంగా నిలిచారు. ఇక సాయి సుదర్శన్ జట్టుకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. 23 బంతుల్లో 48 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీని కొద్దిలో మిస్సయ్యాడు. కాగా, హైదరాబాద్ బౌలర్లో జయదేవ్ ఉనద్కత్ చివరి ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. ఇక జట్టు కెప్టెన్ కమిన్స్, జీషాన్ అన్సారీ చెరో వికెట్ తీసుకున్నారు.


బ్యాటింగ్‌లో తనకు తిరుగేలేదని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్న హైదరాబాద్ ఈ స్కోరు ఛేదిస్తుందా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో జీటీ గెలిస్తే పాయింట్ల పట్టికలో ప్రస్తుత నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకుతుంది. మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ గనుక గెలిస్తే ఎనిమిదో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - May 02 , 2025 | 09:44 PM