India Hockey: భారత్ జోరు
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:56 AM
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. అపజయమెరుగని రికార్డును..
మలేసియాపై గెలుపు
ఆసియా కప్ హాకీ
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు కొనసాగిస్తోంది. అపజయమెరుగని రికార్డును నిలబెట్టుకుంది. సూపర్-4లో తొలి విజయం అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 4-1తో మలేసియాను చిత్తు చేసింది. మన్‌ప్రీత్ సింగ్ (17), సుఖ్‌జీత్ సింగ్ (19), షీలానంద్ లక్రా (24), వివేక్ సాగర్ ప్రసాద్ (38) భారత్ తరపున గోల్స్ చేశారు. మలేసియాకు ఏకైక గోల్‌ను హసన్ షఫీక్ (1) అందించాడు. బుధవారం జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్‌లో కొరియాతో మనోళ్లు డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ గెలుపుతో లభించిన రెండు పాయింట్లతో కలిపి..మొత్తం మూడు పాయింట్లతో సూపర్-4 పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరిగే ఆఖరి పోరులో చైనాతో భారత్ తలపడనుంది. ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకుంటే మనోళ్లకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. ఇక..గురువారం జరిగిన మరో సూపర్-4 మ్యాచ్‌లో చైనా 3-0తో డిఫెండింగ్ చాంపియన్ కొరియాకు షాకిచ్చింది.