నాకౌట్ ఆశలు ఆవిరి
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:12 AM
సుదీర్మన్ కప్ ఫైనల్స్‌లో నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో భారత బ్యాడ్మింటన్ జట్టు నిరాశపరిచింది...
ఇండోనేసియా చేతిలో భారత్ ఓటమి
సుదీర్మన్ కప్ ఫైనల్స్
గ్జియామెన్ (చైనా): సుదీర్మన్ కప్ ఫైనల్స్‌లో నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో భారత బ్యాడ్మింటన్ జట్టు నిరాశపరిచింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం జరిగిన తమ రెండో పోరులో భారత్ 1-4తో పటిష్ట ఇండోనేసియా చేతిలో ఓటమిపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల/తనీషా జోడీ మాత్రమే గెలవగా.. సింగిల్స్‌లో స్టార్లు పీవీ సింధు, ప్రణయ్, మహిళల డబుల్స్‌లో ప్రియ/శ్రుతి, పురుషుల డబుల్స్‌లో హరిహరన్/రూబన్ జంటలు ఓటమిపాలయ్యారు. దీంతో క్వార్టర్స్ చేరకుండానే భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగిన తమ తొలి పోరులో డెన్మార్క్ చేతిలో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్‌లో తమకు ఆఖరిదైన ఇంగ్లండ్‌తో పోరు భారత్‌కు నామమాత్రం కానుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..