Junior Hockey World Cup: మన కుర్రాళ్ల గోల్స్ వర్షం
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:14 AM
పురుషుల జూనియర్ హాకీ వరల్డ్‌క్‌పలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో చిలీని చిత్తుచేసిన టీమిండియా.. శనివారం జరిగిన పోరులో ఒమన్‌పై 17-0తో...
ఒమన్‌పై భారత్ భారీ విజయం
జూనియర్ హాకీ ప్రపంచకప్
చెన్నై: పురుషుల జూనియర్ హాకీ వరల్డ్‌క్‌పలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో చిలీని చిత్తుచేసిన టీమిండియా.. శనివారం జరిగిన పోరులో ఒమన్‌పై 17-0తో భారీ విజయం సాధించింది. ఆరంభం నుంచే దీటుగా చెలరేగిన భారత కుర్రాళ్లు గోల్స్ వర్షంతో ప్రత్యర్థిని బెంబేలెత్తించారు. భారత ఆటగాళ్ల ధాటికి ఒమన్ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది. అర్ష్‌దీప్, మన్‌మీత్, దిల్‌రాజ్ హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించగా.. అజీత్ యాదవ్, ఇంగ్‌లెంబా, గురుజోత్య తలా రెండు గోల్స్‌తో సత్తా చాటారు. అన్మోల్, శర్దానంద్ చెరో గోల్ కొట్టారు. పూల్-బిలో భాగంగా భారత్ తన మూడో మ్యాచ్‌ను స్విట్జర్లాండ్‌తో మంగళవారం ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?