Indias Historic Defeat: చరిత్ర ఎరుగని చెత్తాట
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:20 AM
హార్మర్ దెబ్బకు టీమిండియా హాహాకారాలు చేసింది. స్పిన్‌ను ఎలా ఆడాలో కూడా అర్థం కానట్టుగా.. మన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తయింది....
రెండో టెస్ట్‌లో 408 పరుగులతో భారత్ చిత్తు
హార్మర్‌కు దాసోహం
దక్షిణాఫ్రికా ఘన విజయం
2-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సైమన్ హార్మర్ (6/37)
హార్మర్ దెబ్బకు టీమిండియా హాహాకారాలు చేసింది. స్పిన్‌ను ఎలా ఆడాలో కూడా అర్థం కానట్టుగా.. మన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తయింది. భారత గడ్డపై కనీసం సిరీస్ డ్రా చేసుకొంటే చాలనుకున్న సఫారీలు.. 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.
గువాహటి: లాంఛనం ముగిసింది! చరిత్రలో లేని రీతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. సైమన్ హార్మర్ (6/37) సుడులు తిరిగే బంతులకు దిమ్మతిరిగిన టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌లో భారత్ 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 0-2తో వైట్‌వా్‌షకు గురైంది. కోచ్ గంభీర్ హయాంలో గత 13 నెలల్లో స్వదేశంలో భారత్ క్లీన్‌స్వీ్‌ప కావడం ఇది రెండోసారి. ఇక గత 25 ఏళ్లలో భారత గడ్డపై సఫారీలకు ఇది తొలి సిరీస్ విజయం. నాలుగో ఇన్నింగ్స్‌లో 549 పరుగుల లక్ష్యం దాదాపు అసాధ్యమే. కానీ, టీమిండియా బ్యాటర్లు తుదికంటా పోరాడి కనీసం డ్రాతోనైనా పరువు నిలుపుతారని అభిమానులు ఆశించారు. ఆ ఆశల్ని మన బ్యాటర్లు అడియాశలు చేశారు. ఆటకు ఐదో, ఆఖరి రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 27/2తో రెండు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (54) మినహా ఎవరూ కనీసం రెండు పదులు స్కోరు చేయలేక పోయాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా 489, 260/5 డిక్లేర్ చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా మార్కో యాన్సెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీ్‌స’గా హార్మర్ నిలిచారు.
వేటాడిన హార్మర్: పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో హార్మర్ చెలరేగడంతో.. రెండు సెషన్లు కూడా ముగియకుండానే టీమిండియా చాపచుట్టేసింది. లోబౌన్స్ బంతితో నైట్ వాచ్‌మన్ కుల్దీప్ (5)ను బౌల్డ్ చేసిన హార్మర్.. ఆ వెంటనే ధ్రువ్ జురెల్ (2)ను క్యాచవుట్ చేశాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (14), కెప్టెన్ రిషభ్ పంత్ (13) ఆదుకొంటారని భావించారు. అయితే, పంత్‌ను కూడా హార్మర్ కుదురుకోనీయలేదు. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా ఆచితూచి ఆడడంతో టీ సమయానికి భారత్ 90/5తో నిలిచింది. తిరిగి వచ్చిన తర్వాత సుదర్శన్‌ను ముత్తుసామి వెనక్కిపంపాడు. ఈ దశలో జడ్డూ, సుందర్ (16) ఏడో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యంతో పోరాడే ప్రయత్నం చేశారు. కానీ, సుందర్, నితీశ్ కుమార్ (0)ను హార్మర్ తన వరుస ఓవర్లలో వెనక్కిపంపాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న జడేజాతోపాటు సిరాజ్ (0)ను కేశవ్ అవుట్ చేయడంతో టీమిండియా కథ ముగిసింది. సిరాజ్‌ను అవుట్ చేసిన యాన్సెన్ క్యాచ్ అద్భుతమనే చెప్పాలి. బౌండరీలైన్ వద్ద ఒంటిచేత్తో ఆ క్యాచ్‌ను పట్టిన తీరుకు సిరాజ్‌తోపాటు బవుమా కూడా ఆశ్చర్య పోయారు.
స్కోరు బోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్;
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13, రాహుల్ (బి) హార్మర్ 6, సాయి సుదర్శన్ (సి) మార్‌క్రమ్ (బి) ముత్తుసామి 14, కుల్దీప్ (బి) హార్మర్ 5, జురెల్ (సి) మార్‌క్రమ్ (బి) హార్మర్ 2, పంత్ (సి) మార్‌క్రమ్ (బి) హార్మర్ 13, జడేజా (స్టంప్డ్) వెరీన్ (బి) కేశవ్ 54, సుందర్ (సి) మార్‌క్రమ్ (బి) హార్మర్ 16, నితీశ్ (సి) వెరీన్ (బి) హార్మర్ 0, బుమ్రా (నాటౌట్) 0, సిరాజ్ (సి) యాన్సెన్ (బి) కేశవ్ 0; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 63.5 ఓవర్లలో 140 ఆలౌట్; వికెట్ల పతనం: 1-17, 2-21, 3-40, 4-42, 5-58, 6-95, 7-130, 8-138, 9-140; బౌలింగ్: యాన్సెన్ 15-7-23-1, ముల్డర్ 4-1-6-0, హార్మర్ 23-6-37-6, కేశవ్ 12.5-1-37-2, మార్‌క్రమ్ 2-0-2-0, ముత్తుసామి 7-1-21-1.
ఇంకో మెట్టు కిందికి..
‘డబ్ల్యూటీసీ’లో భారత్‌కు ఐదోస్థానం
దక్షిణాఫ్రికాతో సిరీ్‌స ఓటమితో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగు నుంచి ఐదో స్థానానికి దిగజారింది. ఈ సైకిల్‌లో 9 టెస్ట్‌లు ఆడిన భారత్ 48.15 విజయాల శాతంతో.. పాకిస్థాన్ (50 శాతం) కంటే దిగువకు చేరడం గమనార్హం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి.
భారత్ గడ్డపై అత్యధికంగా 27 వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా బౌలర్ హార్మర్. స్టెయిన్ (26 వికెట్లు)ను హార్మర్ అధిగమించాడు.
ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధికంగా 9 క్యాచ్‌లు అందుకొన్న ఫీల్డర్‌గా మార్‌క్రమ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రహానె 8 క్యాచ్‌ల రికార్డును తిరగ రాశాడు.
పరుగుల పరంగా భారత జట్టు చరిత్రలో ఇది అత్యంత ఘోర పరాజయం. 2004లో నాగ్‌పూర్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 342 రన్స్ తేడాతో ఓటమి అతి పెద్దది. ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!