Indian Womens Team: యువతరానికి మీరు ఆదర్శం
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:38 AM
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. మెగా టోర్నమెంట్‌లో..
న్యూఢిల్లీ: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం రాష్ట్రపతి భవన్‌లో కలిసింది. మెగా టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరచిందని ఈ సందర్భంగా రాష్ట్రపతి కొనియాడారు. ట్రోఫీతో హర్మన్ సేన చరిత్ర సృష్టించడంతోపాటు యువతరానికి ఆదర్శంగా నిలిచిందని ముర్ము ప్రశంసించారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ ట్రోఫీని కెప్టెన్ హర్మన్ రాష్ట్రపతికి అందజేయడంతోపాటు జట్టు సభ్యులు సంతకాలు చేసిన జెర్సీని కూడా బహూకరించారు.